Sun Dec 22 2024 22:00:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ ను జపాన్ లో ఎన్ని లక్షల మంది చూశారో తెలుసా?
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్.. గత ఏడాది మార్చిలో విడుదలైంది. ఈ సినిమాల బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత పలు దేశాలలో సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా జపాన్లో విడుదలై అక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమా అందుబాటులో ఉన్నా కూడా థియేటర్లలో సినిమాలని చూడడానికి క్యూ కడుతున్నారు.
జపాన్లో ఇప్పటి వరకూ పదిహేను లక్షల మందికి పైగా RRRని వీక్షించడం విశేషం. ఈ చిత్రం జపనీస్ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ను సొంతం చేసుకుంది. అందరినీ ఆశ్చర్యపరిచింది. జపాన్లో ఆర్ఆర్ఆర్ని విడుదల చేయడం వల్ల పెద్దగా ఫలితాలు ఉండవని పరిశ్రమకు చెందిన చాలా మంది పెదవి విరిచారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం 305 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సినిమా రన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు.. ఈ చిత్రం 2.345 బిలియన్ల జపనీస్ కరెన్సీని వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఈ చిత్రం రూ.143 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
Next Story