Mon Dec 15 2025 06:27:46 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ న్యూస్ ....RRR రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
RRR మూవీ రిలీజ్ తేదీని మూవీ మేకర్స్ ప్రకటంచారు. మార్చి 25వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది

RRR మూవీ రిలీజ్ తేదీని మూవీ మేకర్స్ ప్రకటంచారు. మార్చి 25వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటికే నాలుగు సార్లు RRR మూవీని వాయిదా వేశారు. ఇటీవల చిత్ర యూనిట్ రెండు తేదీలను ప్రకటించింది. ఈ రెండు తేదీల్లో ఒక తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించింది.
నాలుగు సార్లు వాయిదా.....
నిజానికి సంక్రాంతికి RRR సినిమా విడుదల కావాల్సి ఉంది. జనవరి 7వ తేదీ అని తేదీ కూడా ప్రకటించారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. పాన్ ఇండియా మూవీ కావడం, కరోనా కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూత పడటం, మరికొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీని ప్రకటించడంతో సినిమాను వాయిదా వేశారు. తాజాగా మార్చి 25వ తేదీన RRR మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారుక.
- Tags
- RRR
- release date
Next Story

