Mon Dec 23 2024 15:14:08 GMT+0000 (Coordinated Universal Time)
RRR మూవీకి మరో అవార్డు
RRR మూవీ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజీ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డను సొంతం చేసుకుంది.
RRR సినిమాకు వరసగా అంతర్జాతీయ అవార్డులు వస్తున్నాయి. తాజాగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజీ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డను ఈ మూవీ సొంతం చేసుకంది. అనేక అంతర్జాతీయ సినిమాలతో పోటీ పడి ఈ అవార్డును RRR మూవీ దక్కించుకుంది. ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని ఈ మూవీ అందుకున్న సంగతి తెలిసిందే.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజీ...
తాజాగా మరో అవార్డును RRR మూవీ యూనిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ పురస్కారాన్ని సాధించిన తర్వాత దర్శకుడు రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలసి ప్రేక్షకులకు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ అవార్డుతో RRR మూవీ ప్రపంచ దేశాల్లో మరో మెట్టు ఎక్కినట్లయింది.
Next Story