Mon Dec 23 2024 02:00:02 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి వస్తోన్న చిత్రాలివే..
ఆదిపురుష్ విడుదలయ్యే ప్రతి థియేటర్ లో ఒక సీటును రాముడిని ఎంతో ఆరాధించే హనుమంతులవారి కోసం ఉంచాలని..
ప్రతీవారం థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ ఫాం లు కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. వెబ్ సిరీస్ లు, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా వెబ్ సిరీస్ లు, సినిమాలు ఓటీటీల్లో, థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్నాయి.
మోస్ట్ అవైటెడ్ సినిమా ఆదిపురుష్.. ఈ వారమే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. జూన్ 16న ఆదిపురుష్ విడుదలకు ముస్తాబవుతోంది. ఆదిపురుష్ విడుదలయ్యే ప్రతి థియేటర్ లో ఒక సీటును రాముడిని ఎంతో ఆరాధించే హనుమంతులవారి కోసం ఉంచాలని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. ప్రభాస్ - కృతిసనన్ సీతారాములుగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికైతే భారీ అంచనాలే ఉన్నాయి. మోషన్ క్యాప్చర్ అనే టెక్నాలజీతో తీసిన ఈ కొత్త ఫార్మాట్ లో రామాయణాన్ని ఎలా చూపిస్తారోనని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
జూన్ 16న విడుదలమవుతున్న మరో చిత్రం బొమ్మై. ఎస్జే సూర్య, ప్రియా భవానీశంకర్ జంటగా నటించిన ఈ సినిమాకు రాధామోహన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళంలో మాత్రమే విడుదలవుతున్న బొమ్మై సినిమాలో చాందిని, డౌట్ సెంథిల్, ఆరోల్ శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.
జూన్ 16న ది ఫ్లాష్ అనే హాలీవుడ్ సినిమా విడుదల కానుంది. డీసీ, వార్నర్ బ్రదర్స్ సమర్పణలో ఈ సినిమా రాబోతోంది. డీసీ ఎక్స్ టెండెడ్ యూనివర్స్ అనే సినిమాకు కొనసాగింపుగా ది ఫ్లాష్ ఉండనుంది. ఎజ్రామిల్లర్ సూపర్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒకప్పుడు హాలీవుడ్ బ్యాట్మాన్ గా వెలుగొందిన మైఖల్ కీటన్ మళ్లీ బ్యాట్ మ్యాన్ గా అలరించనున్నాడు.
ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే వెబ్ సిరీస్ లు, చిత్రాలివే..
జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో జీ కర్దా హిందీ వెబ్ సిరీస్
16న నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ మూవీ ఎక్స్ ట్రాక్షన్ విడుదల
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 15న సైతాన్ తెలుగు వెబ్ సిరీస్, 17న బిచ్చగాడు -2 స్ట్రీమింగ్
జియో సినిమాలో జూన్ 16న ఐ లవ్ యూ
ఈటీవీ విన్ లో 16న కనులు తెరిచిన కనులు మూసినా సినిమా స్ట్రీమింగ్
జూన్ 16 సోనీ లివ్ లో ఫర్హాన(తెలుగు) విడుదల
Next Story