డిసెంబర్ లో సినిమాల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా
వచ్చే నెల డిసెంబర్ లో చిన్న సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల దాకా దాదాపు పాతిక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 21న నాలుగు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. 'పడి పడి లేచె మనసు', 'అంతరిక్షం', 'యాత్ర', 'కాంచన 3 ' ఆల్రెడీ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈనాలుగు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.
హను రాఘవపూడి - శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్నా 'పడి పడి లేచె మనసు' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో అంచనాలు ఏర్పడ్డాయాయి. వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా వస్తున్నా 'యాత్ర' పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. అలానే 'కాంచన' కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సో ఇప్పుడు రిలీజ్ అయ్యే 'కాంచన 2 ' పై కూడా ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వీరికి డిసెంబర్ నెల మిస్ అయితే ఫిబ్రవరిలో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 21న తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నారు ఆయా దర్శకనిర్మాతలు.
అయితే ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. డిసెంబర్ అంటే నాన్ సీజన్ మహా అయితే క్రిస్మస్ కి రెండు రోజులు సెలవలు ఉంటాయి అంటే. దానికి తోడు నాలుగు క్రేజీ సినిమాలు వస్తున్నాయి. అంతే కాదు హిందీ సినిమాలు రాబోతున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ ముందుగానే అలోచించి "చిన్న మొత్తాల్లో అడ్వాన్సులు ఇస్తాం.. దాంతో సరిపెట్టుకోండి..సినిమా రిలీజ్ అయ్యాక మిగిలిన డబ్బు ఇస్తాం" అని చెబుతున్నారట. సంక్రాంతికి బరిలో సినిమాల కోసం అడ్వాన్సులు కట్టి రెడీగా ఉన్న బయ్యర్లు.. మళ్లీ ఈ సినిమాలకు డబ్బులు తెచ్చుకోలేరు. అందుకే.. మీకు నమ్మకం ఉంటే సినిమాలు విడుదల చేసుకోండి.. లేదంటే లేదు అని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. మరి దీని ప్రొడ్యూసర్స్ ఏమి అలోచించి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వీరిని కాదని ప్రొడ్యూసర్స్ సొంతంగా విడుదల చేసుకుంటారేమో చూడాలి. సో డిసెంబరు 21న రాబోయే సినిమాల ఈ నాలుగు సినిమాలూ సంక్షోభంలో పడినట్టైంది.