Mon Dec 23 2024 19:27:28 GMT+0000 (Coordinated Universal Time)
ఈ దీపావళికి వస్తోన్న టాలీవుడ్ సినిమాలివే..
ఈ శుక్రవారం విడుదలకు రెడీ అయిన మరో సినిమా సర్దార్. తమిళహీరో కార్తి డ్యూయల్ రోల్ లో యాక్షన్ సినిమాగా తెరకెక్కిందీ మూవీ..
దసరా ముగిసి.. దీపావళి హంగామా మొదలైంది. దసరాకి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు స్వాతిముత్యం కూడా విడుదలై.. సూపర్ హిట్ అందుకున్నాయి. గతవారం చిన్న చిన్న సినిమాలు థియేటర్లలో విడదలయ్యాయి. ఈ వారం దీపావళికి ముందుగానే.. కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ 'జిన్నా'. సునీల్, రఘుబాబు, నరేశ్, సురేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ నెల 21న విడుదలవుతున్న మరో సినిమా ఓరి దేవుడా ! యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీగా తెరకెక్కిన మూవీ ఇది. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ 'ఓ మై కడవుళే' కు రీమేక్. ఈ సినిమాపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ శుక్రవారం విడుదలకు రెడీ అయిన మరో సినిమా సర్దార్. తమిళహీరో కార్తి డ్యూయల్ రోల్ లో యాక్షన్ సినిమాగా తెరకెక్కిందీ మూవీ. కార్తి తండ్రీకొడుకులుగా డిఫెరెంట్ గెటప్స్ తో అదరగొట్టబోతున్న ఈ సినిమాలో రజిషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్స్. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో లైలా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ హీరో శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో నటిస్తు్న్న ఫస్ట్ మూవీ 'ప్రిన్స్'. ఈ మూవీతో మరియా ర్యాబోషెప్కా అనే ఉక్రెయిన్ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. శివకార్తికేయన్ స్కూల్ టీచర్ గా నటించగా.. సత్యరాజ్ కీలకపాత్ర పోషించారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవీ డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు, తమిళ బైలింగువల్ మూవీ ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, నుష్రత్ బరుచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మన సత్యదేవ్ నటించిన రామ్ సేతు సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. ఈ దీపావళి కానుకగా మొత్తం 5 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి వీటిలో ఏయే సినిమాలు పేలుతాయి.. ఏయే సినిమా తుస్సుమంటాయో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.
Next Story