Mon Dec 23 2024 04:39:19 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాటపై విజయసాయి ప్రశంసలు
సర్కారువారిపాట సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. సమకాలీన అంశాలను..
విజయవాడ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారువారిపాట సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సర్కారువారిపాట రూ.10 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. కాగా.. సర్కారువారిపాట సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. "సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట' బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు" అని విజయసాయి ట్వీట్ లో పేర్కొన్నారు.
సర్కారువారిపాట సినిమా లాభాల బాటపట్టాలంటే.. సుమారు రూ.100 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. భారీ బడ్జెట్ సినిమా, పెద్దహీరో సినిమా కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లను వారం నుంచి 10 రోజులవరకూ పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. మరి తొలిరోజు సర్కారువారిపాట.. ఎంత వసూలు చేస్తుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.సర్కారువారి పాటపై విజయసాయి ప్రశంసలు
Next Story