‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ రికార్డు
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. [more]
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. [more]
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది. ఒక్కరోజులోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది. ట్రైలర్‌లోని కొన్ని ఫన్నీ డైలాగ్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ‘నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ, నా వల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పవుతుంది’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత పెంచేలా ఉన్నాయి. యూత్‌ని ఆకట్టుకునే అంశాలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని ‘కోపంగా.. కోపంగా..’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు అఖిల్ వేసిన స్టెప్స్ సూపర్బ్. ఈ పాట యూత్‌ను బాగా మెప్పిస్తుంది. ఆల్రెడీ చిత్రంలోని అన్ని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సూపర్‌హిట్ అవ్వడంతో సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయని చెప్పొచ్చు.
తారాగణం, సాంకేతిక నిపుణులు
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.