Mon Dec 23 2024 09:30:59 GMT+0000 (Coordinated Universal Time)
నా డ్రీమ్ బాయ్ అలా ఉండాలి : సీతారామం బ్యూటీ మృణాల్
ఈ సినిమాలో మృణాల్ ని చూసిన యువత.. తమ డ్రీమ్ గర్ల్ కూడా సీత లా ఉండాలని కలలు కంటున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ తన డ్రీమ్..
టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సీతారామం. ఆగస్టు 5న తెలుగుతో పాటు.. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి, ఘన విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది. హను సినిమాలో శేఖర్ కమ్ముల హీరోయిన్ లా.. సీత పాత్రలో కట్టు, బొట్టు, అభినయంతో కుందనపు బొమ్మలా కనిపించి.. కుర్రకారు మనసుల్ని దోచుకుంది మృణాల్.
ఈ సినిమాలో మృణాల్ ని చూసిన యువత.. తమ డ్రీమ్ గర్ల్ కూడా సీత లా ఉండాలని కలలు కంటున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ తన డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నేనే ఏం ఆలోచిస్తున్నానో ముందుగానే అర్ధం చేసుకునే వాడే నా భాగస్వామిగా రావాలి. కానీ అలాంటి వాళ్లు అంత ఈజీగా దొరకరు. నాకు పిల్లల్ని కనాలని ఉంది. అందుకే సరోగసి పద్ధతిలో పిల్లల్ని కంటాను లేదా మదర్ థెరీసా లాగా ఒంటరిగా మిగిలిపోతాను." అని ప్రేమ, పెళ్లి, పిల్లలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. కాగా.. ప్రస్తుతం సీతారామం హిందీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Next Story