Mon Dec 23 2024 05:32:53 GMT+0000 (Coordinated Universal Time)
రేటు పెంచేసిన "సీతారామం" బ్యూటీ
సీతారామంలో అమ్మడి అందచందాలతో పాటు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించిన లుక్స్, ఆమె హావభావాలు ప్రేక్షకులను..
టాలీవుడ్ లో ఇటీవల వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ప్రేక్షకుల మనసులు దోచుకున్న చిత్రం "సీతారామం". హను రాఘవపూడి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. రామ్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో ఒదిగిపోయింది. తన అందంతో ప్రేక్షకుడిని కట్టిపడేసింది మృణాల్. సీత క్యారెక్టర్ తో ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చింది. బింబిసార - సీతారామం ఒకేసారి విడుదలైనప్పటికీ.. ఆ పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచిందీ సినిమా.
సీతారామంలో అమ్మడి అందచందాలతో పాటు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించిన లుక్స్, ఆమె హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక మృణాల్ అందానికి చాలామంది టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు. సీతారామం హిట్ తో.. మృణాల్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నట్లు టాక్. ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతున్న పేరు మృణాల్. టాలీవుడ్ లో తన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో.. మృణాల్ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిందట. ఇప్పటికే రెండ్ ప్రాజెక్టుల్లో మృణాల్ కు ఆఫర్ లభించగా.. అందులో ఒకటి వైజయంతి మూవీస్ బ్యానరే కావడం విశేషం.
సీతా రామం తరువాత మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించే ఛాన్స్ రావడంతో, మృణాల్ తన రెమ్యునరేషన్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోందట. సీతా రామం సక్సెస్ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. తన నెక్ట్స్ సినిమాల్లో రెమ్యునరేషన్ ను ఏకంగా కోటిరూపాయలకు పెంచేసిందని తెలుస్తోంది. అయితే.. సీతా రామంలో ఈ అమ్మడి పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన నిర్మాతలు.. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడట్లేదట.
Next Story