Mon Dec 23 2024 04:36:31 GMT+0000 (Coordinated Universal Time)
మృణాల్ సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా..?
మృణాల్ మొదటి సినిమా ఏంటి..? ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చింది..? ఆమెకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమన్నా ఉందా..?
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సీతగా ఇక్కడ అందరి మనసులు దోచుకుంది. మృణాల్ కి తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూసి మేకర్స్ కూడా అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ నాని 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో నటిస్తుంది. కాగా హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.
ఇక ఈ ప్రమోషన్స్ నాని అండ్ మృణాల్ కలిసి సందడి చేస్తున్నారు. తాజాగా ఇద్దరు కలిసి ఒక సరదా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరి స్టార్స్ గురించి గూగుల్ ఎక్కువ వెతికిన ప్రశ్నలను అడిగారు. ఈక్రమంలోనే మృణాల్ మొదటి సినిమా ఏంటి..? ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చింది..? ఆమెకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమన్నా ఉందా..? అనే ప్రశ్నలు అడగగా మృణాల్ వాటికీ బదులిచ్చింది.
మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
"నాకు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ రేపు నా పిల్లలకు ఉంటుంది. ఇక నా మొదటి సినిమా వచ్చి మరాఠి మూవీ 'హలో నందన్'. సినిమాల్లోకి రావడానికి ముందు నేను డాక్టర్ చదువుతున్నాను. డెంటిస్ట్ కోర్స్ చేయడానికి నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. కానీ నేను దాని మీద కాన్ఫిడెంట్ గా లేను. నా ఫ్రెండ్స్ కూడా అదే విషయాన్ని అడిగేవాళ్ళు. అసలు నువ్వు ఏం అవ్వుదాం అనుకుంటున్నావు అని ప్రశ్నించేవారు.
ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ అయితే బాగుంటుంది. యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ఒక ఆడిషన్ జరిగింది. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు ఒక మాట అన్నారు. నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇస్తే నాలుగేళ్ళ తరువాత అవకాశం వస్తుందని నిరుత్సాహపరుస్తూ మాట్లాడాడు. ఆ మాటలకి జవాబు చెప్పాలని, ఫస్ట్ ఆడిషన్ లోనే సెలెక్ట్ అవ్వాలని గట్టిగా అనుకోని వెళ్లి పర్ఫామెన్స్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను. అలా సినిమాలోకి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చింది.
Next Story