Mon Dec 23 2024 04:57:15 GMT+0000 (Coordinated Universal Time)
Mrunal Thakur : బాలీవుడ్ సింగర్తో మృణాల్ డేటింగ్లో ఉందా..?
బాలీవుడ్ స్టార్ సింగర్తో మృణాల్ డేటింగ్లో ఉందా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం నాని సరసన 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, కొన్నిరోజులు నుంచి మృణాల్ పెళ్లి, ప్రేమ రూమర్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒక అవార్డుల వేడుకల్లో అల్లు అరవింద్, మృణాల్తో తెలుగు కోడలిగా రమ్మని చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.
మృణాల్ ఠాకూర్ నిజంగానే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడం, దాని గురించి మృణాల్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మృణాల్ కి సంబంధించిన మరో రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షాతో మృణాల్ డేటింగ్ చేస్తుందా..? అని సందేహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు.
నవంబర్ 10న బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె ఇంట దివాళీ బ్యాష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈక్రమంలోనే మృణాల్ ఠాకూర్, బాద్షా కూడా హాజరయ్యారు. ఇక అక్కడ శిల్పా, బాద్షాతో కలిసి దిగిన ఒక ఫోటోని మృణాల్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. "ఇద్దరు ఫేవరెట్ వ్యక్తులు" అంటూ పేర్కొన్నారు. ఇక అదే పార్టీ నుంచి లీక్ అయిన ఒక వీడియోలో మృణాల్ అండ్ బాద్షా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు.
ఇలా కనిపించడం పైనే అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మృణాల్, బాద్షాతో డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ సృష్టిస్తున్నారు. కాగా ఇవి కేవలం రూమర్సే అని అర్ధమవుతున్నాయి. ఎందుకంటే మృణాల్ గతంలో బాద్షాతో కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ లో నటించారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఆ వీడియోలో కూడా వారిద్దరూ ఏమీ కంప్లీట్ గా చేతులు పట్టుకొని నడవలేదు. మృణాల్ వెళ్లిపోయే సమయంలో గుడ్ బై చెప్పే క్రమంలో అలా చేతులు జోడించుకున్నారు. ఆ వీడియోని తీసుకోని నెట్టింట మృణాల్, బాద్షా డేటింగ్ అంటూ వార్తలు పుట్టించేస్తున్నారు నెటిజెన్స్.
Next Story