Mon Dec 23 2024 04:40:02 GMT+0000 (Coordinated Universal Time)
Mrunal Thakur : హరి పోటర్‌తో మృణాల్ ఠాకూర్.. పిక్ వైరల్..
ఫ్యాన్ గర్ల్ మృణాల్ ఠాకూర్ తన ఫేవరెట్ చైల్డ్‌హుడ్ స్టార్ హరి పోటర్ ని కలుసుకున్నారు.
Mrunal Thakur : టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్.. తెలుగులో వరుస ప్రేమ కథలు చేస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. రీసెంట్ గా నాని సరసన 'హాయ్ నాన్న' సినిమాలో యశ్న, వర్ష పాత్రల్లో నటించి మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ హరి పోటర్ నటుడు డేనియల్ రాడ్‌క్లిఫ్ (Daniel Radcliffe) తో కనిపించారు.
హరి పోటర్ సిరీస్ లో టైటిల్ రోల్ లో నటించిన డేనియల్ రాడ్‌క్లిఫ్.. అందరికి గుర్తుకు ఉండే ఉంటారు. ఆ హరి పోటర్ సిరీస్ చూడని వారంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఆ సిరీస్‌ని, అందులోని పాత్రలని ఎంతో ఇష్టపడుతుంటారు. మృణాల్ ఠాకూర్ కూడా అలాంటి ఒక అభిమానే. తాజాగా ఈ ఫ్యాన్ గర్ల్.. హరి పోటర్ ని కలుసుకున్నారు. అతనితో సెల్ఫీ దిగిన ఫోటోని, వీడియోలను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. గతంలో విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో గీతగోవిందం వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో జరుగుతున్నట్లు సమాచారం.
మొన్నటివరకు ఇక్కడే హాయ్ నాన్న ప్రమోషన్స్ లో ఉన్న మృణాల్.. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కోసం వెళ్లిన క్రమంలోనే అక్కడ హరి పోటర్ ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్, విజయ్.. భార్యాభర్తలుగా నటిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు.
Next Story