Mon Dec 23 2024 04:22:29 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ కోసం #NTR30 వేట.. తాజాగా తెరపైకి పాన్ ఇండియా హీరోయిన్ పేరు
#NTR30 కోసం కొరటాల శివ పాన్ ఇండియా కథను రెడీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ కు..
RRR సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. #NTR30 కోసం కొరటాల శివ పాన్ ఇండియా కథను రెడీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ కు ఒక డేట్ ఫిక్సయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 23న సినిమా ఓపెనింగ్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 3 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్. అయితే ఈ సినిమాకు ఇంతవరకూ హీరోయిన్ ఫిక్సవ్వలేదు.
ఇటీవల జాన్వీకపూర్ ఈ సినిమాలో నటిస్తోందంటూ వార్తలొచ్చాయి. అయితే తన కూతురు ఏ సౌత్ ఇండియా సినిమాలోనూ నటించడం లేదని బోనీ కపూర్ తేల్చి చెప్పేశారు. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. సీతారామంలో.. సీతగా అందరి మనసుల్ని దోచిన మృణాల్ ఠాకూర్. సినిమా కథ నచ్చడంతో ఆమె రెమ్యునరేషన్ విషయంలో ఓ మెట్టు దిగొచ్చిందని టాక్. ఈ అమ్మడు #NTR30కి హీరోయిన్ గా ఫిక్సయితే.. పాన్ ఇండియా ఇమేజ్ కూడా సొంతమవుతుందని చిత్రయూనిట్ భావిస్తోందట. త్వరలోనే #NTR30 హీరోయిన్ పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Next Story