Mon Dec 23 2024 10:13:25 GMT+0000 (Coordinated Universal Time)
ది కశ్మీర్ ఫైల్స్, RRR సినిమాలపై ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర కామెంట్స్
మొదటి మూడ్రోజుల్లోనే రూ.500 కోట్ల షేర్ ను వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది RRR సినిమా. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ
ములుగు : దర్శకధీరుడు రాజమౌళి తీసిన కల్పిత కథ RRR సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామ్-భీమ్ లుగా చరణ్-తారక్ లు ఆన్ స్క్రీన్ పై చేసిన యాక్షన్ హంట్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి మూడ్రోజుల్లోనే రూ.500 కోట్ల షేర్ ను వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది RRR సినిమా. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. ప్రతిరోజూ రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది.
తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క RRRపై ఆసక్తికర కామెంట్లు చేశారు. భారతదేశాన్ని విభజించాలనుకుంటే 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడండి.. దేశాన్ని ఏకం చేయాలనుకుంటే 'ఆర్ఆర్ఆర్' చూడండంటూ సీతక్క కామెంట్స్ చేశారు. సినిమాలో తారక్-చరణ్ లు అద్భుతంగా నటించారని ప్రశంసించారు. RRR ఘనవిజయం సాధించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ట్వీట్ చేశారు.
Next Story