Tue Dec 24 2024 02:33:18 GMT+0000 (Coordinated Universal Time)
Bigboss Non stop : వెక్కి వెక్కి ఏడ్చిన సరయు.. ముమైత్ అవుట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. మొత్తం కంటెస్టెంట్లలో చివరకు ముమైత్ ఖాన్, సరయు మిగిలారు
బిగ్ బాస్ నాన్ స్టాప్ తొలి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. మొత్తం కంటెస్టెంట్లలో చివరకు ముమైత్ ఖాన్, సరయు మిగిలారు. తొలుత ఎలిమినేషన్ నుంచి హమీదా, చైతన్య, మిత్రా శర్మ తదితరలు సేఫ్ అయ్యారు. ఎలమినేషన్ ఫైనల్ రౌండ్ కు రాగానే ముమైత్ ఖాన్, సరయు మిగిలారు. సరయు తాను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానని భావించి వెక్కి వెక్కి ఏడ్చింది.
బోరున విలపించిన...
తోటి హౌస్ సభ్యులు సరయును ఓదార్చినా ఆమె ఏడుపు ఆపలేదు. చివరకు నాగార్జున సరయు సేఫ్ అయినట్లు ప్రకటించారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ తొలి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుంచి వెళ్లిపోయింది. తనను హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేశారని ముమైత్ ఖాన్ నాగార్జున వద్ద బోరున విలపించింది. తనకు అగ్రెస్సివ్ ట్యాగ్ పెట్టి హౌస్ మేట్స్ తనను బయటకు పంపారని ముమైత్ నాగార్జున వద్ద పేర్కొంది. ముమైత్ ఖాన్ హౌస్ మేట్స్ కు వర్తీ, వేస్ట్ ట్యాగ్స్ పెట్టారు
Next Story