Mon Dec 23 2024 04:06:42 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ 'అతడు' ఉదయ్ కిరణ్ చేయాల్సింది.. కానీ అల్లు అరవింద్..
మహేష్ బాబు చేసిన అతడు మూవీ ఉదయ్ కిరణ్ చేయాల్సింది. కానీ అల్లు అరవింద్..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'అతడు'. మాస్ విత్ క్లాస్ స్క్రీన్ ప్లే వచ్చిన ఈ సినిమా.. అన్ని సెక్షన్ ఆడియన్స్ ని ఆకట్టుకొని మంచి విజయం అందుకుంది. మహేష్ కెరీర్ లో ఈ సినిమాకి కూడా ఒక బెస్ట్ ఫిలింగా చోటు ఉంది. కాగా ఈ మూవీ స్టోరీని ముందుగా పవన్ కళ్యాణ్ కి చెప్పను అని త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. పవన్ ఆ సినిమా చేయలేదని త్రివిక్రమ్ ఇప్పటికి పవన్ ని తిడతాడంట.
అయితే ఈ మూవీ కథ పవన్, మహేష్ తో పాటు మరో హీరో దగ్గరకి కూడా వెళ్లిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత తెలియజేశాడు. సీనియర్ యాక్టర్ మురళి మోహన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ మూవీ కథ మహేష్ దగ్గరకి వెళ్లడానికంటే ముందు ఉదయ్ కిరణ్ దగ్గరకి వెళ్లిందట. సినిమా కథ విన్న ఉదయ్ కిరణ్ కూడా.. మూవీ చేయడానికి ఒకే చెప్పాడట. దీంతో మురళి మోహన్, త్రివిక్రమ్.. ఉదయ్ తో 'అతడు' చేయడానికి సిద్ధం అయ్యారు.
కానీ అంతా ఒకే అయినా ఆ మూవీ పట్టాలు ఎక్కలేకపోయింది. అసలేమీ జరిగిందంటే.. ఈ మూవీ ఒకే చేసిన తరువాత చిరంజీవి కూతురితో ఉదయ్ కిరణ్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీంతో ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మూవీ డేట్స్ విషయాలు అల్లు అరవింద్ చూసుకోవడం మొదలు పెట్టాడు. ఈక్రమంలోనే ఉదయ్ కిరణ్ కన్ఫ్యూజన్ లో పడి.. అతడు మూవీకి ఇవ్వాల్సిన డేట్స్ వేరే సినిమాకి ఇచ్చేశాడట. దీంతో ఉదయ్ కి కుదరకపోవడంతో.. ఆ కథని మహేష్ బాబు దగ్గరకి తీసుకు వెళ్లారని మురళి మోహన్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వార్త తెలుసుకున్న ఆడియన్స్.. ఈ మూవీ ఉదయ్ కిరణ్ కి పడి ఉంటే తన కెరీర్ ఇంకో రేంజ్ లో ఉండేదని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న 33 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఈ సూసైడ్ టాలీవుడ్ లో ఒక బ్లాక్ మోల్ గా మిగిలిపోయింది.
Next Story