అలా లో ఆయనకి అన్యాయం జరిగిందా?
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి ఎంత పేరొచ్చిందో.. ఆయన ఫాదర్ గా నటించిన మురళి శర్మకి అంతే పేరొచ్చింది. అల్లు అర్జున్ మెయిన్ పిల్లర్ అయితే.. [more]
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి ఎంత పేరొచ్చిందో.. ఆయన ఫాదర్ గా నటించిన మురళి శర్మకి అంతే పేరొచ్చింది. అల్లు అర్జున్ మెయిన్ పిల్లర్ అయితే.. [more]
అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కి ఎంత పేరొచ్చిందో.. ఆయన ఫాదర్ గా నటించిన మురళి శర్మకి అంతే పేరొచ్చింది. అల్లు అర్జున్ మెయిన్ పిల్లర్ అయితే.. మురళి శర్మ మిడిల్ పిల్లర్ లా అల వైకుంఠాపురాన్ని అంత ఎత్తుకు లేపారు. మురళి శర్మ హావభావాలు, పాత్ర తీరు అన్ని అద్భుతంగా పండాయి. అంతలా నటించిన మురళి శర్మ కి ఇప్పుడు అల వైకుంఠపురములో నిర్మాణ సంస్థలలో ఒకటైన గీత ఆర్ట్స్ బాధపెట్టింది అనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే అల వైకుంఠపురములో హిట్ లో భాగస్వామి అయినా మురళి శర్మ అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్ కి హాజరుకాకపోవడమే అంటున్నారు.
మాములుగా మురళి శర్మ కాల్షీట్ లెక్కన కాకుండా రోజుకింతని పారితోషకం తీసుకుంటాడట. అయితే అల వైకుంఠపురములో 50 రోజుల డేట్స్ కి ఇంతని పారితోషకం మురళి శర్మకి ఫిక్స్ చేశారట. అయితే అటు ఇటుగా మురళి శర్మ అల వైకుంఠపురములో సినిమా కోసం 70 రోజుల కాల్షీట్స్ వాడాడట. అంటే 70 రోజులు అల షూటింగ్ కి హాజరయ్యాడన్నమాట. అయితే ముందు 50 రోజులకు అనుకున్నట్టుగా 50 రోజుల పారితోషకమే ఇచ్చి.. మిగతా 20 రోజుల పారితోషకం విషయంలో మురళి శర్మ ని ముప్పుతిప్పలు పెడుతుందట గీత ఆర్ట్స్. మురళి శర్మ మిగతా 20 రోజులకు పారితోషకం డిమాండ్ చేసినా… గీత ఆర్ట్స్ పట్టించుకోక పోవడంతో… మురళి శర్మ అల సక్సెస్ ఈవెంట్స్ కి హాజరవడం లేదని తెలుస్తుంది.