Mon Dec 23 2024 10:17:12 GMT+0000 (Coordinated Universal Time)
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం
భానుమతి .. దర్శకుడు రాజమౌళికి పిన్ని వరుస అవుతారు. కొద్దిసేపటిలో ఆమె భౌతిక కాయాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారు.
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో.. ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో కీరవాణి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
భానుమతి .. దర్శకుడు రాజమౌళికి పిన్ని వరుస అవుతారు. కొద్దిసేపటిలో ఆమె భౌతిక కాయాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. ఆమె మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా.. రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ దాదాపు కీరవాణినే సంగీతాన్ని అందించారు. అన్నమయ్య, స్టూడెంట్ నంబర్ 1 నుండి ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకూ కీరవాణినే సంగీత స్వరాలను సమకూర్చారు. అన్నమయ్య, స్టూడెంట్ నం.1, ఛత్రపతి, వెంగమాంబ, బాహుబలి, బాహుబలి2 సినిమాలకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా, సంగీతదర్శకుడిగా నంది, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. కీరవాణి పూర్తిపేరు కోడూరి మరకతమణి కీరవాణి. ఆయన కొడుకు కాలభైరవ.. ఆర్ఆర్ఆర్ లో కొమురం భీముడో పాటను ఆలపించారు.
Next Story