Mon Dec 23 2024 00:48:21 GMT+0000 (Coordinated Universal Time)
17 ఏళ్ల వివాహ జీవితాన్ని.. వీడియో రూపంలో పోస్ట్ చేసిన నమ్రత
నిన్న ఈ జంట 17వ పెళ్లిరోజును జరుపుకుంది. నమ్రతా శిరోద్కర్.. తమ 17 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఓ చిన్న వీడియో రూపంలో చూపించే
టాలీవుడ్ సూపర్ కపుల్.. మహేష్ బాబు - నమ్రత. వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడగుపెట్టి అప్పుడే 17 ఏళ్లు పూర్తయింది. ఇద్దరు పిల్లలు. కానీ.. మన సూపర్ స్టార్ ఇంకా.. ప్రిన్స్ లాగానే కనిపిస్తారు. మహేష్ కు పెళ్లై.. ఇద్దరు పిల్లలున్నారంటే తెలియనివారెవరూ నమ్మరు. నిన్న ఈ జంట 17వ పెళ్లిరోజును జరుపుకుంది. మహేష్ బాబు నిన్న ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు చిరంజీవి, ప్రభాస్ తదితరులతో కలిసి రాగా.. చిరంజీవి మహేష్ కు స్పెషల్ బొకే ఇచ్చి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ నెట్టింట్లో బాగా వైరల్ అయింది.
Also Read : ఖిలాడి రివ్యూ - హిట్టా ? ఫట్టా ?
ఇక మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్.. తమ 17 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఓ చిన్న వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి.. దాని కింద ఇలా రాశారు. హాస్యం, నమ్మకం, గౌరవం, దయ, సహనంతో కూడిన ప్రేమ చాలా బాగుంటుంది. మన ఈ ప్రేమ జీవితాంతం ఇలాగే ఉండాలి. అప్పుడే జీవితం చాలా అందంగా ఉంటుంది. హ్యాపీ 17 మహేష్. అని నమ్రత తెలిపారు. నమ్రతా పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Next Story