Sun Dec 22 2024 22:07:31 GMT+0000 (Coordinated Universal Time)
వరుస సినిమాలతో మైత్రీమూవీస్ హ్యాట్రిక్ సక్సెస్
ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వచ్చారు. రెండు మూడు..
టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. వరుస సినిమాలతో.. నెలరోజుల వ్యవధిలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుందీ నిర్మాణ సంస్థ. ఈ ఏడాది సంక్రాంతి వెంటవెంటనే రెండు భారీ మూవీస్ తో వచ్చి.. బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. వాల్తేరు వీరయ్య ఇప్పటికీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా.. కల్యాణ్ రామ్ అమిగోస్ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. మైత్రీమూవీస్ సంస్థ వారి ఆనందానికి అవధుల్లేవు.
"శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం" లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టి స్ట్రాంగ్ బేస్ వేసుకుంది మైత్రీ మూవీ మేకర్స్. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ప్యాషనెట్ గా సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు. ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వచ్చారు. రెండు మూడు సినిమాల్ని ఏకకాలంలో షూట్ జరపడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రతీ ఏడాది కోట్ల టర్నోవర్ తో భారీ సినిమాలు నిర్మించే మైత్రీ 2023 లో ఏకంగా రెండు సినిమాల్ని ఒకేసారి రిలీజ్ చేసి రెండూ కలిపి 350 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టింది. ఇప్పుడు అమిగోస్ కూడా పాజిటివ్ టాక్ తో.. మంచి వసూళ్లు రాబడుతోంది.
ప్రస్తుతం ఖుషి, పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16, నడిగర్ తిలకం సినిమాలు ఉండగా త్వరలో సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తుంది. ఇవే కాకుండా ఆహా ఓటీటీ కోసం సిరీస్ లు కూడా నిర్మిస్తోంది.
Next Story