Mon Dec 23 2024 10:49:33 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : కల్కి టైటిల్లో '2898 AD'కి ఓ లాజిక్ ఉంది.. దర్శకుడు కామెంట్స్
ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ టైటిల్లో '2898 AD'కి ఓ లాజిక్ ఉందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
Kalki 2898 AD : హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్ మాదిరి టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తు ప్రపంచంలో ఇండియన్ సిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూపిస్తూ.. హిందూ పురాణ కథలను ఆధారంగా తీసుకోని ఒక అద్భుతమైన సినిమాని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. విష్ణుమూర్తి దశావతారం అయిన కల్కిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.
దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టతనకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా విషయాలు పై ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఐఐటీ బాంబేలో జరిగిన టెక్ఫెస్ట్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన నాగ్ అశ్విన్.. కల్కి కోసం ఉపయోగిస్తున్న టెక్నాలజీ, అలాగే మూవీకి సంబంధించిన విషయాలను మాట్లాడారు.
ఇండియాలో సైన్స్ ఫిక్షన్ మూవీస్ పెద్దగా రాలేదని, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కొన్ని చిత్రాలు వచ్చినప్పటికీ.. కల్కి వాటన్నింటికన్నా ఎంతో భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో ఫారిన్ కంట్రీస్ భవిషత్తులో ఎలా ఉంటాయో చూశారు. ఇప్పుడు కల్కి ద్వారా ఇండియన్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ చూస్తారని వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఎంతో కష్టపడి, స్క్రాప్ ద్వారా ఒక కొత్త ఊహా ప్రపంచాన్ని సృస్టిస్తునట్లు తెలియజేశారు.
ఫ్యూచర్ టెక్నాలజీలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, కాస్ట్యూమ్స్.. ఇలా అన్నిటిని కూడా భారతీయ మూలాలతోనే డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవన్నీ ఆడియన్స్ కి నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ లో '2898 AD' అని ఓ టైమ్లైన్ పెట్టిన విషయం అందరూ గమనించిందే. అది చూసి అందరూ.. ఈ సినిమా స్టోరీ అప్పుడు జరుగుతుందని ఒక అంచనా వేసుకున్నారు.
ఇక విషయం గురించి నాగ్ అశ్విన్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. "అలా పెట్టడం వెనుక ఓ లాజిక్ ఉంది. ఆ లాజిక్ గురించి రిలీజ్ దగ్గర సమయంలో చెబుతాను" అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అని ప్రశ్నించగా, దానికి బదులిస్తూ.. "93 రోజుల్లో రావొచ్చు" అని చెప్పారు. అంటే 2024 ఏప్రిల్ 1 రావొచ్చు అని హింట్ ఇచ్చారు. ఇక నాగ్ అశ్విన్.. టైటిల్ పై, ట్రైలర్ రిలీజ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story