Fri Dec 20 2024 12:12:47 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన నాగ్ అశ్విన్..
కల్కి ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక మూవీ విడుదల తేదీని..
Kalki 2898 AD : ప్రభాస్ ని సూపర్ హీరోగా చూపిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. ఆధునిక టెక్నాలజీ నేపథ్యంతో హిందూ పురాణాల కథని సరికొత్తగా చూపేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ ఈ మూవీలో మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారంటూ నిర్మాత అశ్విని దత్ తెలియజేశారు.
కాగా ఈ మూవీ నుంచి ఒక చిన్న టైటిల్ టీజర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. ఈ సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తారంటూ ప్రకటించినప్పటికీ.. చిత్రీకరణ పూర్తి అవ్వలేదంటూ పోస్టుపోన్ చేశారు. దీంతో అసలు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఈలోపు ఏమైనా అప్డేట్స్ అయినా ఇస్తారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో అతిపెద్ద పండుగా సంక్రాంతి రాబోతుంది. దీంతో ఆరోజు ఏమైనా అప్డేట్ వస్తుందా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఆసక్తితోనే ఓ అభిమాని.. ఏకంగా ట్రైలర్ గురించి ప్రశ్నించాడు. రీసెంట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్.. బాంబే ఐఐటీ టెక్ ఫస్ట్‌కి గెస్ట్ గా వెళ్లారు. అక్కడు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన నాగ్ అశ్విన్‌కి.. కల్కి ట్రైలర్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ క్యూస్షన్ కి నాగ్ అశ్విన్ బదులిస్తూ.. "93 రోజుల్లో రావొచ్చు" అని చెప్పారు. దర్శకుడు పర్టికులర్‌గా 93 అని నెంబర్ చెప్పడంతో.. అభిమానులు ఈరోజు (డిసెంబర్ 29) నుంచి లెక్కపెడుతూ 93వ రోజు ఏ డేట్ వచ్చిందో లెక్కలు వేసుకుంటున్నారు.
అలా లెక్కబెట్టుకొని చూస్తే.. 2024 ఏప్రిల్ 1 వస్తుంది. దీంతో ఆ రోజునే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ వార్త చూసిన కొంతమంది అభిమానులు.. సినిమా రిలీజ్ పై అంచనాలు వేయడం మొదలు పెట్టారు. ట్రైలర్ ఏప్రిల్ స్టార్టింగ్ లో వస్తుంది అంటే.. మూవీ ఏప్రిల్ లోనే రిలీజ్ కాబోతుందా అని ప్రశ్నలు వేస్తున్నారు.
Next Story