Fri Dec 20 2024 06:22:26 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : కల్కికి రెండు క్లైమాక్స్లు సిద్ధం చేస్తున్నారట..
ప్రభాస్ కల్కి మూవీ రెండు క్లైమాక్స్లతో ఆడియన్స్ ముందుకు రాబోతుందట.
Kalki 2898 AD : ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న టాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా 'కల్కి'. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది. సూపర్ హీరో గాడ్జెట్స్ బ్యాక్డ్రాప్ హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పదుకోనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తుండడంతో.. సినిమా పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో ఈ మూవీకి సంబంధించిన ఏదో వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కి క్లైమాక్స్ ని రెండు విధాలుగా ప్లాన్ చేశారట. ఇటీవల లోకేష్ కనగరాజ్ కూడా 'లియో' క్లైమాక్స్ ని మూడు విధాలుగా చూపించారు. ఇప్పుడు కల్కి క్లైమాక్స్ ని కూడా అదేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ వార్తతో పాటు మరో వార్త కూడా రెండు మూడు రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఈ సినిమా కథకి, అనంతపద్మనాభ స్వామి చివరి ద్వారానికి లింక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ, ఆడియన్స్ లో మాత్రం ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఈ మూవీలో హిందూ పురాణంలో చెప్పబడిన సప్త చిరంజీవులు కనిపించబోతున్నారట.
ఇంకా బ్రతికే ఉన్న సప్త చిరంజీవులు.. వేద వ్యాసుడు, పరుశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్య, అశ్వత్థామ, బలి చక్రవర్తి (అసుర రాజు) పాత్రలను ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ ఏడు చిరంజీవులుగా రాజమౌళి, రానా, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్, దుల్కర్ అండ్ విజయ్ కనిపించబోతున్నారట. కాగా ఈ మూవీని మే 9న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుందట.
Next Story