Mon Dec 23 2024 06:33:20 GMT+0000 (Coordinated Universal Time)
నాగచైతన్య చేస్తే తప్పు కానిది.. సమంత చేస్తే తప్పా..?
నాగచైతన్య, సమంత విడాకులతో దూరం అయినా.. ఏదొక విషయంలో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) జంటని చూసి చాలా మంది మురిసిపోయారు. కానీ ఆ జంట కలకాలం కలిసి ఉండలేకపోయింది. మధ్యలోనే విడాకులు తీసుకోని విడిపోయారు. వారి విడాకులు అక్కినేని, సామ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కర్ని బాధకి, షాక్కి గురి చేసింది. ఇక ఈ విడాకులు జరిగిన దగ్గర నుంచి ఏదో విధంగా వీరిద్దర్నీ ట్రోల్ చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
సమంతని టార్గెట్ చేస్తూ అక్కినేని అభిమానులు, చైతన్యని ట్రోల్ చేస్తూ సామ్ అభిమానులు.. ఇలా సోషల్ మీడియాలో అనేక సార్లు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య కామెంట్స్ వార్ జరిగేది. వీటి పై సమంత కూడా ఒకసారి స్పందించింది. "నా పై రూమర్లు వస్తే నిజమంటారు. ఎదుట వారిపై రూమర్లు వస్తే మేమే చేయించాం అంటారు. ఏదైనా మమ్మల్నే అంటారు" అని బాధ పడింది. ఇక ఇటీవల చైతన్య, సమంతని సపోర్ట్ చేస్తూ.. "తాను చాలా మంచి అమ్మాయి. ఆమెకు మంచి లైఫ్ ఉండాలి" అంటూ మాట్లాడాడు.
నాగచైతన్య ఇలాంటి కామెంట్స్ చేసిన తరువాత కూడా కొంతమంది అభిమానులు సమంతని టార్గెట్ చేయడం మానడం లేదు. తాజాగా ఖుషి (Kushi) సినిమాలో సమంత, విజయ్ దేవరకొండతో రోమాన్స్ చేస్తూ లిప్ లాక్ సీన్స్ లో నటించడంతో.. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంత అభిమానులు దానికి బదులిస్తూ.. నాగచైతన్య మూవీలోని ఒక సీన్ ని షేర్ చేస్తున్నారు.
'థాంక్యూ' మూవీలో హీరోయిన్ రాశిఖన్నాతో నాగచైతన్య లిప్ లాక్ సీన్ లో నటించాడు. ఈ మూవీ కూడా విడాకులు తరువాత జరిగినదే. అప్పుడు చైతన్య చేస్తే తప్పు కానిది, ఇప్పుడు సమంత చేస్తే తప్పు అయ్యిందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోకి లేని రూల్స్ హీరోయిన్ కి ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story