Mon Dec 23 2024 11:16:34 GMT+0000 (Coordinated Universal Time)
సమంతతో విడాకులు.. మొదటిసారి స్పందించిన నాగచైతన్య
తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పిన తర్వాత.. చైతూ మొదటిసారి స్పందించాడు. తొలిసారి మీడియా ముందు
టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒక జంట అయిన సమంత - నాగచైతన్య.. తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి మూడునెలలు దాటింది. నాలుగేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. విడాకులను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత సమంత చాలా సందర్భాల్లో స్పందించారు. తాను చనిపోతా అనుకున్నా కానీ.. ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నానంటూ సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ తాను మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తోంది సమంత.
తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పిన తర్వాత.. చైతూ మొదటిసారి స్పందించాడు. తొలిసారి మీడియా ముందు తన డివోర్స్ విషయంపై స్పందించి వార్తల్లో నిలిచారు చైతు. నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చైతన్య. ఈ ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల విషయంపై ప్రశ్నించగా.. చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు. 'ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్ అది. ఇప్పుడు నేను హ్యాపీ.. తను(సమంత) హ్యాపీ' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చైతన్య విడాకుల తర్వాత లైఫ్ లో మూవ్ ఆన్ అవుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News Summary - Naga Chaitanya First time Responded on his Divorce with Samantha
Next Story