Mon Dec 23 2024 16:05:38 GMT+0000 (Coordinated Universal Time)
భోళాశంకర్ లో కీర్తికిి జోడీగా నాగ చైతన్య ?
భోళా శంకర్ సినిమా తమిళంలో హిట్ కొట్టిన వేదాళం కి రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. కాగా.. కీర్తికి జోడీగా నాగశౌర్య
టాలీవుడ్ మెగాస్టార్ ప్రస్తుతం మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్యథియేటర్లలో సందడి చేయనుంది. దాని తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీర్రాజు సినిమాలు షూటింగ్ కు సిద్ధమయ్యాయి. కాగా.. భోళా శంకర్ సినిమా తమిళంలో హిట్ కొట్టిన వేదాళం కి రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
కాగా.. కీర్తికి జోడీగా నాగశౌర్య అయితే బాగుంటాడని భావించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహానటి సినిమాలో ఒక సీన్ లో కీర్తితో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగచైతన్య అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాడని చిత్ర యూనిట్ భావిస్తోందట. కానీ.. చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఈ ఆఫర్ కు ఒప్పుకుంటాడో లేదోనని నాగశౌర్య ను సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నట్లు సమాచారం.
కాగా.. త్వరలోనే నాగ చైతన్య నటించిన విక్రమ్ కుమార్ మూవీ 'థ్యాంక్యూ'ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రీసెంట్ గా 'బంగార్రాజు' షూటింగును కూడా పూర్తి చేశాడు. ఇక మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందుకే చైతూ ఒప్పుకుంటాడో లేదో అనుకుంటూనే.. మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి కీర్తితో జోడి కట్టేందుకు చైతూ ఓకే చెప్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది భోళాశంకర్ చిత్ర బృందం. మరి కీర్తి పక్కన కనిపించే ఆ హీరో ఎవరో కన్ఫర్మ్ గా తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.
Next Story