చైతు అలా అయితే… సాయి పల్లవి మాత్రం
సాయి పల్లవి – నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై [more]
సాయి పల్లవి – నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై [more]
సాయి పల్లవి – నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చైతు మజిలి తో సూపర్ హిట్, వెంకిమామ తో యావరేజ్ హిట్ అందుకోవడం, ఫిదా లాంటి లవ్ స్టోరీ ని శేఖర్ కమ్ముల తెరకెక్కించడం, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ లో విడుదల టార్గేట్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పై ఓ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఈ సినిమాలో పల్లెటూళ్లకు చెందిన అబ్బాయి, అమ్మాయిగా కనిపించనున్నారని… పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందట. అయితే లవ్ స్టోరీ లో హ్యాపీ ఎండింగ్ ఉండదని.. ఈ సినిమా క్లైమాక్స్ విషాదాంతంగా దర్శకుడు రాసుకున్నాడు అని… నాగ చైతన్య పాత్ర సినిమా చివరిలో చచ్చిపోగా.. సాయి పల్లవి మాత్రం చైతు జ్ఞాపకాలతో.. జీవితాంతం ఒంటరిగా మిలిపోతుందట. ఇఇక ఈకథలో ఎంతో ఎమోషన్ ఉంటుందని.. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకుడు కంటతడి పెడతాడని అంటున్నారు.