Mon Dec 23 2024 06:08:57 GMT+0000 (Coordinated Universal Time)
నాగచైతన్య అలా.. సమంత ఇలా.. పోస్టులు వైరల్..
నాగచైతన్య పోస్టులు చూసి సంతోషపడిన అభిమానులను.. సమంత పోస్టులు బాధకి గురి చేస్తున్నాయి.
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోని విడిపోయి.. ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదిక తమ కోరికను కూడా చై-సామ్ కి తెలియజేస్తూ వస్తున్నారు. కాగా ఇటీవల కస్టడీ ప్రమోషన్స్ లో నాగచైతన్య.. సమంత గురించి చాలా బాగా మాట్లాడడం, అక్కినేని ఫ్యామిలీతో సమంత కూడా ఇంకా మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తుండడం.. అభిమానుల్లో ఉన్న కోరికకు మరింత ఆశని కలగజేస్తుంది.
ఇక ఇటీవల నాగచైతన్య దగ్గర సమంత ఫేవరెట్ పెట్ డాగ్ ‘హాష్’ కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సమంత పెంపుడు కుక్క చైతన్య దగ్గర ఏం చేస్తుంది..? అక్కడికి ఎలా వచ్చిందని..? అని అందరిలో సందేహం మొదలైంది. ప్రస్తుతం నాగచైతన్య ఆ కుక్కతో హ్యాపీ టైం స్పెండ్ చేస్తున్నాడు. హాష్ తో ఉన్న ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాడు. ఇక ఈ పోస్టు చూసిన ఆడియన్స్.. చై-సామ్ కలుస్తున్నారా..? అనే ఒక ఆశ మొదలైంది. చైతన్య పోస్టుతో అభిమానులు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు.
అయితే అభిమానుల సంతోషాన్ని.. సమంత తన పోస్టుతో పోగొట్టేసింది. సమంత తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ ఫొటోల్లో సమంత చీర అందాలతో వావ్ అనిపిస్తుంది. అయితే నెటిజెన్స్ సమంత అందాలతో పాటు ఫొటోలో మరొక విషయం కూడా గమనించారు. సమంత నడుము మీద నాగచైతన్య పేరుతో ఒక చిన్న టాటూ ఉండాలి. అయితే తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో సమంత నడుము పై చైతన్య టాటూ కనిపించడం లేదు.
ఇక ఇది గమనించిన అభిమానులు.. సమంత ఆ టాటూని పూర్తిగా తొలిగించిందా..? లేదా మూవీస్లో కవర్ చేసినట్లు ఆ ఫోటోషూట్లో కూడా టాటూని కవర్ చేసిందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య పోస్టులు చూసి ఈ జంట మళ్ళీ కలవబోతున్నారా అని సంతోషపడిన అభిమానులను సమంత పోస్టులు బాధకి గురి చేస్తున్నాయి.
Next Story