Mon Dec 23 2024 07:47:11 GMT+0000 (Coordinated Universal Time)
సమంతతో రొమాన్స్ చేయడం ఇష్టం : నాగ చైతన్య
ప్రస్తుతం చైతు.. లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్ జంటగా
బంగార్రాజు సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని హీరోలు. తండ్రి కొడుకులు కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండ్రోజుల్లో ఊహించని కలెక్షన్లు వచ్చాయి. నాగచైతన్య సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల చైతూ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన మాజీ భార్య గురించి ప్రస్తావన రాకుండా లేదు. సమంత గురించి, తమ విడాకుల గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ.. చైతన్య మాత్రం సమంత విషయంలో చాలా కూల్ గా రియాక్ట్ అవుతున్నాడు. మొన్నీమధ్య వచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విడాకుల గురించి ప్రశ్నించగా.. చాలా కూల్ గా సమాధానమిచ్చాడు చైతన్య.
Also Read : సర్కారువారి పాట మళ్లీ వాయిదా ?
ప్రస్తుతం చైతు లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్ జంటగా నటించిన ఈ సినిమా.. త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరైన చైతూకి.. మీ ఉత్తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరు..? అని ప్రశ్న ఎదురైంది. దానికి చైతు తడుముకోకుండా సమంత అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామ్ తో నేను చాలా కంఫర్టబుల్ గా ఉంటాను అని చైతూ చెప్పగా.. సామ్ కాకుండా ఇంకెవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. బాలీవుడ్ లో అలియా భట్, దీపికా పదుకొనే తో నటించడం ఇష్టమని తెలిపాడు. ఇక చాలా రోజుల తర్వాత చైతన్య తన మాజీ భార్య గురించి మాట్లాడటం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Next Story