Mon Dec 23 2024 11:30:05 GMT+0000 (Coordinated Universal Time)
'కృష్ణ వ్రింద విహారి' టీజర్ విడుదల
హీరోయిన్ ప్రేమ కోసం హీరోపడే ఆరాటం.. ఆమె అలకలు.. బుజ్జగింపులు .. ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ..
హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. గతేడాది వరుడు కావలెను, లక్ష్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా రెస్పాన్స్ లేదు. కొత్త సంవత్సరంలో 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో రానున్నాడు నాగశౌర్య. శౌర్యకి లేడీస్, ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అనీష్ కృష్ణ దర్శకత్వంలో సొంత బ్యానర్లో 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. శౌర్యకి జంటగా షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయం కానుంది. సోమవారం 'కృష్ణ వ్రింద విహారి' నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి.. ఇది లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అలాగే రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతోంది. హీరోయిన్ ప్రేమ కోసం హీరోపడే ఆరాటం.. ఆమె అలకలు.. బుజ్జగింపులు .. ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర అసహనాన్ని ప్రదర్శించడం.. 'పెళ్లి చేసుకుందాం'లో వెంకటేశ్ కంటే బాగా చూసుకుంటాను వంటి కామెడీ టచ్ తో ఈ టీజర్ నడిచింది. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Next Story