Mon Dec 23 2024 01:33:12 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి రంగబలి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
నాగశౌర్య - సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే ..
హ్యాండ్సమ్ హంక్ నాగశౌర్య హీరోగా.. పవన్ బాసంశెట్టి తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ మూవీ రంగబలి. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జులై 7న థియేటర్లలో విడుదలై.. యువత నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. నాగశౌర్య - సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే రంగబలి ఓటీటీ బాటపట్టింది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ పార్ట్ నర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేర అలరించనుందో చూడాలి.
ఇప్పటికే ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. నాయకుడు, స్పై సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 27 నుంచి స్ట్రీమ్ అవుతుండగా.. శ్రీవిష్ణు నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ సామజవరగమన జులై 28 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతూ.. ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. త్వరలోనే రీసెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ సినిమా కూడా ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈరోజు (జులై28) విడుదలై బ్రో స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది.
Next Story