Mon Dec 23 2024 04:36:53 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా నాగశౌర్య - అనూష పెళ్లి వేడుక..(VIDEO)
వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఒక సమయంలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారిన విషయం తెలిసిందే..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో నాగశౌర్య ఒకరు. ఇప్పుడు ఆ లిస్టులో నుండి నాగశౌర్య పేరు తొలగిపోయింది. శౌర్యకి పెళ్లైపోయింది. ఆదివారం ఉదయం బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నాగశౌర్య- అనూష శెట్టిల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పండితులు వేదమంత్రాలు చదువుతుండగా.. నాగశౌర్య-అనూష మెడలో మూడుముళ్లు వేశాడు. అనంతరం ఆమెను గట్టిగా పట్టుకుని పెళ్లైపోయిందంటూ.. ఆనందం వ్యక్తం చేశాడు నాగశౌర్య. శనివారం రాత్రి సంగీత్ వేడుక జరిగింది. కానీ.. ఈ పెళ్లిలో ఎక్కడా టాలీవుడ్ ప్రముఖులు కనిపించలేదు.
వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఒక సమయంలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారిన విషయం తెలిసిందే. అనూష ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ది బైస్ట్ ఇంటీరియర్ గా అవార్డు కూడా అందుకుంది. ఆమె సొంతూరు కర్ణాటకలోని మంగళూరు కుందాపూర్ గ్రామం. జూనియర్ ఎన్టీఆర్ తల్లి కూడా అదే గ్రామంలో పుట్టారు. దాంతో.. వీరిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఇదేనంటూ ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇక పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులకు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
Next Story