Mon Dec 23 2024 06:10:52 GMT+0000 (Coordinated Universal Time)
భయంతో వెనక్కి వెళ్తున్నాము.. గుంటూరు కారం నిర్మాత..
భయంతో గుంటూరు కారం అప్డేట్స్ ని వెనక్కి తీసుకు వెళ్తున్నాము అంటూ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ కాకపోయినా ఆడియన్స్ లో మంచి ప్రజాధారణ పొందాయి. ప్రస్తుతం మహేష్ అండ్ త్రివిక్రమ్ కూడా మంచి ఫార్మ్ లో ఉండడం, గత రెండు సినిమాలు మాదిరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలా కాకుండా మాస్ మసాలా చిత్రంగా గుంటూరు కారం తెరకెక్కుతుండడంతో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక చిన్న గ్లింప్స్, అలాగే కొన్ని పోస్టర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఒకే సన్నివేశానికి సంబంధించినవి కావడంతో ఆడియన్స్ కొత్త అప్డేట్స్ ని అడుగుతున్నారు. మూవీ నుంచి ఒక సాంగ్ అయినా రిలీజ్ చేయమని కోరుతున్నారు. దీనికి నిర్మాతలు బదులిస్తూ.. కంపోసిషన్ అయ్యిపోయింది, చిత్రీకరణ అయ్యిపోయింది, సాంగ్ లో మహేష్ బాబు అదరగొట్టేశాడు అని చెబుతున్నారు తప్ప రిలీజ్ చేయడం లేదు.
ఈ దసరాకి సాంగ్ ని రిలీజ్ చేసేస్తున్నామని ప్రకటించిన నిర్మాత నాగవంశీ.. ఆ సాంగ్ గురించి ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా నేడు ఒక ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ రిలీజ్ గురించి ప్రశ్నించగా, నాగవంశీ సమాధానం ఏంటంటే.. "సాంగ్ పై ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు, హైప్ చూసి భయం వేస్తుంది. అందుకనే లిరికల్ సాంగ్ ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రతిసారి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ నవంబర్ ఫస్ట్ వీక్ లో మాత్రం కచ్చితంగా రిలీజ్ అయ్యిపోతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
మరి ఈసారైనా వస్తుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ విషయంలో ఏమన్నా చేంజ్ ఉందా..? ఆ సమయానికి చాలా సినిమా వస్తున్నాయి. పోస్టుపోన్ చేసే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా, నాగవంశీ బదులిస్తూ.. "రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేదేలే. ఎన్ని సినిమాలు వచ్చినా మేము మాత్రం సంక్రాంతికే వస్తాము" అంటూ వెల్లడించాడు. కాగా ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది.
Next Story