Sun Dec 22 2024 21:07:18 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ కోసం రష్మికని కలవలేదు.. నిర్మాత నాగవంశీ..
విజయ్ దేవరకొండ సినిమా కోసం మేము రష్మికని అసలు కలవలేదు అంటున్న నిర్మాత నాగవంశీ.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం VD12, VD13 సినిమాల్లో నటిస్తున్నాడు. VD13 పరుశురామ్ తెరకెక్కుస్తుంటే, VD12 గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పై మంచి బజ్ నెలకుంది. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న మూవీ పై విజయ్ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి ఉంది. జెర్సీ సినిమాతో అందరిని ఆకట్టుకున్న గౌతమ్.. ఇప్పుడు విజయ్ తో ఒక పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించబోతున్నాడు.
ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. కాగా ఈ మూవీ పై అనేక రూమర్స్ గత కొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకుందని, ఆ ప్లేస్ లోకి నిర్మాతలు రష్మిక మందన్న (Rashmika Mandanna) ని తీసుకు వచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాత నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ మాట్లాడుతూ.. "విజయ్ దేవరకొండ సినిమా కోసం మేము రష్మికని అసలు కలవలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ని మార్చడం అనేది జరగలేదు. మా బ్యానర్ లో శ్రీలీల ఇంకా చాలా మూవీస్ చేస్తుంది. అలాంటి తనని ఎందుకు మారుస్తాము" అంటూ వెల్లడించాడు. ఇక ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ ని పెడుతున్నట్లు పేర్కొన్నాడు. గౌతమ్ తిన్ననూరి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెడుతున్నట్లు వెల్లడించాడు.
ఈ మూవీ ఒకవేళ ఆడియన్స్ కి రీచ్ అయ్యితే.. ఓ రేంజ్ హిట్టుని నమోదు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ 'ఖుషి' హిట్ టాక్ తెచుకున్నప్పటికీ.. కలెక్షన్స్ రాబట్టలేక కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. గౌతమ్ తెరకెక్కించిన జెర్సీ కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. అలాంటిది ఈ సినిమా కోసం నిర్మాతలు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
Next Story