Mon Dec 23 2024 07:35:55 GMT+0000 (Coordinated Universal Time)
వరుణ్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి చెప్తే చాలు !
తాజా వరుణ్ పెళ్లి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ నాగబాబును వరుణ్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. దానికి ..
హైదరాబాద్ : టాలీవుడ్ లో కొద్దిరోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఈ పుకార్లను ఖండిస్తూ వస్తున్నారు నాగబాబు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లపై లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అందులో నిజం లేదని స్పష్టం చేసి, ట్రోలర్స్ కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది.
తాజాగా వరుణ్ పెళ్లి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ నాగబాబును వరుణ్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. దానికి నాగబాబు జవాబిచ్చారు. వరుణ్ ఎవరిని ప్రేమించినా తమకేమీ అభ్యంతరం లేదని, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తమకు చెప్తే.. వెంటనే పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు. మెగా ప్రిన్స్ పెళ్లిపై నాగబాబు చాలా క్లారిటీగా ఉన్నట్లు ఈ ఆన్సర్ తో తేలిపోయింది. మరి వరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా ? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాడా ? తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే మరి.
Next Story