Mon Dec 23 2024 03:07:46 GMT+0000 (Coordinated Universal Time)
సమంతే చైతన్యను విడాకులు కోరింది : నాగార్జున
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునను చైతన్య - సమంత విడాకుల గురించి ప్రశ్నించగా.. స్పందించారు.
టాలీవుడ్ పాపులర్ కపుల్ సమంత - నాగచైతన్యలు ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏమాయ చేశావే తో తెలుగు తెరకి పరిచయం అయి.. ఆ సినిమాతోనే చైతన్యతో ప్రేమలో పడి.. నాలుగేళ్ల క్రితం పెళ్లాడి తెలుగింటి కోడలైంది ఈ తమిళ పొన్ను. నాలుగేళ్ల తమ వివాహ బంధానికి.. విడాకులతో స్వస్తి పలుకుతూ అందరికీ షాకిచ్చారు చైసామ్. అయితే తాజాగా.. వీరి విడాకులపై నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read : వివాదంలో మెగా కోడలు ఉపాసన.. అసలేం జరిగింది ?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునను చైతన్య - సమంత విడాకుల గురించి ప్రశ్నించగా.. నాగా స్పందించారు. సమంతే చైతూ నుంచి విడాకులు కోరిందని నాగార్జున చెప్పుకొచ్చారు. విడాకుల ప్రయత్నాలను మొదట సమంతే మొదలుపెట్టిందని, తన నిర్ణయాన్ని గౌరవించి.. చైతన్య అందుకు ఓకే చెప్పాడని నాగార్జున ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడీ వీడియోనే నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. చైతన్య - సమంతలు ప్రస్తుతం ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు. సమంత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుండగా.. చైతన్య చేతిలోనూ రెండు ప్రాజెక్టులున్నాయి.
Next Story