Mon Dec 23 2024 05:29:49 GMT+0000 (Coordinated Universal Time)
నాగ్-99లో అల్లరి నరేష్, ఆ ఇద్దరు ముద్దగుమ్మలు.. నా సామిరంగ..!
నాగార్జున 'నా సామిరంగ' సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడట. అలాగే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు..
టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) 'ఘోస్ట్' మూవీ ప్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీసుకోని తన కొత్త సినిమాని ప్రకటించాడు. తన 99వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకి 'నా సామిరంగ' (Naa Saami Ranga) అనే మాస్ టైటిల్ ని పెట్టాడు. ఈ మూవీ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ తోనే సినిమాలోని తన లుక్ ని కూడా రివీల్ చేశాడు. టైటిల్ కి తగ్గట్టే నాగార్జున రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. కాగా ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు వివరాలు మూవీ టీం ఇంకా తెలియజేయలేదు.
అయితే ఫిలిం వర్గాల్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నాగ్-99 లో చేయడానికి ఆ యాక్టర్స్ ఫైనల్ అయ్యిపోయారని సమాచారం. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) ఈ సినిమాలో నటించబోతున్నాడట. మూవీలో నాగార్జునతో పాటు ఒక బలమైన పాత్ర, కథని మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉంటుందట. ఆ పాత్రనే నరేష్ పోషించబోతున్నాడట. గతంలో నరేష్.. మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో ఇలాంటి పాత్రని పోషించాడు.
ఇప్పుడు కూడా అదే తరహాలో ఈ సినిమాలోని పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వీరిద్దరికి జంటగా ఇద్దరు ముద్దుగుమ్మలను కూడా ఫైనల్ చేసేశారట. అమిగోస్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 'ఆషికా రంగనాథ్', ఉగ్రం సినిమాలో నరేష్ సరసన నటించిన ‘మిర్నా మీనన్’ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించబోతున్నారని సమాచారం. అయితే ఈ నటీనటుల ఎంపిక గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా ఈ మూవీని కొత్త దర్శకుడు 'విజయ్ బిన్నీ' డైరెక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2024 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగార్జున ఇప్పటికే బంగార్రాజు, సొగడే చిన్నినాయనా సినిమాలతో సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. మరి ఈసారి కూడా అది రిపీట్ చేస్తాడా అనేది చూడాలి.
Next Story