Mon Dec 23 2024 17:08:16 GMT+0000 (Coordinated Universal Time)
టబూతో రిలేషన్ షిప్ రూమర్లపై నాగార్జున స్పందన ఇదే !
టబుకు మీకు ఉన్న రిలేషన్ షిప్ ఎలాంటిదని ప్రశ్నించగా.. నాగార్జున దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘‘టబూ నాకు..
టాలీవుడ్ హిట్ పెయిర్ లో నాగార్జున-టబు జంట ఒకటి. వీరిద్దరూ కలిసి నటించింది మూడు సినిమాలే అయినా.. ఇద్దరి మధ్య ఏదో ఉందని నేటికీ అభిమానులు అనుకుంటుంటారు. 1995లో వచ్చిన సిసింద్రీలో టబు నాగార్జున లవర్ గా ఒకపాటలో కనిపించి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 1996లో నిన్నే పెళ్లాడతా, 1998లో ఆవిడా మా ఆవిడే సినిమాలు వచ్చాయి. ఆ రెండు హిట్టయ్యాయి. కానీ.. నిన్నే పెళ్లాడతాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండటం వల్లనో ఏమో గానీ.. నాగార్జున- టబు మధ్య రిలేషన్ షిప్ ఉందని బాగా రూమర్లొచ్చాయి. చాలాకాలంపాటు వీరిద్దరూ రిలేషిప్ లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి.
తాజాగా.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆ రూమర్లను ఖండించారు. టబుకు మీకు ఉన్న రిలేషన్ షిప్ ఎలాంటిదని ప్రశ్నించగా.. నాగార్జున దానిపై క్లారిటీ ఇచ్చారు. ''టబూ నాకు అద్భుమైన స్నేహితురాలు. మా స్నేహం నాకు 21 - 22 ఏళ్లు, టబూకి 16 ఏళ్ల వయసు నుంచే కొనసాగుతోంది. అంటే జీవితంలో సగం కాలం. మా స్నేహం గురించి చెప్పింది చాలా తక్కువ. నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరును పలికారంటే నా మొహం వెలిగిపోతుంది. దాన్ని మీరు ఏదో అనుకుంటే అది మీరు చూసే దృక్పథం నుంచే ఉంటుంది. నా వరకు అయితే ఆమె అందమైన వ్యక్తి. అందమైన ఫ్రెండ్. అది ఎప్పటికీ అలానే ఉంటుంది'' అని తెలిపారు. టబూ అమలకు కూడా మంచి స్నేహితురాలు కావడం గమనార్హం. గతంలో ఓ ఇంటర్వ్యూలో అమలు ఈ విషయాన్ని చెప్పారు.
Next Story