కోడలి పేరు మాత్రమే మారిందన్న నాగ్
హీరోయిన్స్ కి పెళ్లి కాగానే వాళ్ల కెరీర్ కి ఇక బ్రేక్ పడినట్లే అనేది ఒకప్పటి ఏమిటి.... ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం పెళ్లి, పిల్లలున్నా హీరోయిన్స్ గా వెలిగిపోయినవారు ఉన్నారు. తాజాగా సోనమ్ పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ గా సినిమాలలో జోరు చూపిస్తుంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్ లలో అయితే హీరోయిన్ కి పెళ్లీడు దాటిపోయినా పెళ్లి చేసుకోరు. కారణం కెరీర్ ని వదిలేసుకోవాల్సి వస్తుందని. కానీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మాత్రం పెళ్లి వయసు రాగానే ప్రేమ పెళ్లి చేసుకుని కెరీర్ లోనూ సాఫీగా సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. నాగ చైతన్య ని పెళ్లాడిన తర్వాత సమంత చేసిన సినిమాలన్నీ హిట్టే. అంత అద్భుతంగా వుంది సమంత పెళ్లి తర్వాత కెరీర్.
కోడలిని చూస్తే గర్వంగా ఉంది...
అలాగే సమంత పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సమంత పెళ్లి తర్వాత అందుకుంటున్న విజయాలతో ఆమె మావ నాగార్జున మాత్రం ఫుల్ గా సంతోష పడిపోతున్నాడు. సమంత పెళ్లి తర్వాత కెరీర్ లో అందుకుంటున్న సక్సెస్ లు చూసి సంతోషంగా ఉందని.. సమంత అక్కినేని కోడలిగా అడుగు పెట్టడం గర్వంగా ఉందని, పెళ్లి తర్వాత సమంతలో వచ్చిన ఒకే ఒక మార్పు ఆమె చిరునామాయే అని.. సమంత రౌత్ ప్రభు నుండి సమంత అక్కినేనిగా మాత్రమే ఆమెలో మార్పు వచ్చిందని అంతకుమించి ఆమెలో తాను ఏ మార్పూ చూడట్లేదని చెబుతున్నాడు నాగార్జున. ఇక పెళ్లి తర్వాత సమంత అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో సక్సె ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుందని.. పెళ్లయ్యాక రంగస్థలం, మహానటి, ఇరుంబుతురై వంటి హిట్స్ తో సమంత బెస్ట్ అయ్యిందని.. సమంత కి అంత మంచి పేరు రావడం తనకెంతో గర్వంగా ఉందని చెబుతున్నాడు నాగ్. ఇకముందు కూడా సమంతా కెరీర్ బాగుండాలని.. ఇకముందు కూడా మంచి సినిమాలు చేస్తూ సమంత ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.