Fri Dec 20 2024 23:57:26 GMT+0000 (Coordinated Universal Time)
నాగార్జున గారు.. మీరు ఆ పాత్ర నుంచి బయటకి రావాలి..
నాగార్జునకి నెటిజెన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు. ఆ పాత్ర నుంచి మీరు బయటకి వచ్చి మాకోసం కొందరి..
నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 మొదలయ్యి ఫుల్ ఆన్ ఎంటర్టైనింగా సాగుతుంది. ఉల్టా పల్టా అంటూ మొదలయిన ఈ సీజన్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ అంతా బయటకి వచేస్తుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఐదు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని బయటకి పంపించేశారు.
కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ.. ఇలా టాప్ అనుకున్నవారే బయటకి వచ్చేస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారని ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకుంది. అయితే ఈ వీక్ కూడా లేడీ కంటెస్టెంటే బయటకి వెళ్లబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో శోభా శెట్టి, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, అమర్దీప్, టేస్టీ తేజ ఉన్నారు. వీరిలో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని నెటిజెన్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడి గేమ్ తీరుపై బాగా ట్రోలింగ్ జరుగుతుంది. కొన్ని టాస్క్‌ల్లో శోభా శెట్టి.. మరి చిల్లరిగా ప్రవర్తిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆడియన్స్ లో ఈ భామపై నెగటివిటీ రావడంతో.. ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో శోభా శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతుందని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వారం కూడా లేడీ కంటెస్టెంటే బయటకి వెళ్లబోతుందా అని తెలుసుకున్న నెటిజెన్స్.. నాగార్జునకి ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు.
నాగార్జున నటించిన 'మన్మధుడు' సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ మూవీ ఫస్ట్ హాఫ్ లో నాగార్జున లేడీస్ పై కోపం చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆ పాత్రలో ఉండే.. హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ అందర్నీ బయటకి పంపించేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున గారు మీరు ఆ పాత్ర నుంచి బయటకి వచ్చి మాకోసం కొందరి లేడీస్ అన్న లోపల ఉంచండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగ్ ఈ వారం ఎవరిని బయటకి తీసుకు వస్తాడో చూడాలి.
Next Story