Mon Dec 23 2024 06:22:50 GMT+0000 (Coordinated Universal Time)
నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదల.. లైగర్ ఇంటర్వెల్ లో 'ది ఘోస్ట్' ట్రైలర్
ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్లలో లైగర్ ఇంటర్వెల్ లో ప్లే చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ కు..
కింగ్ నాగార్జున - క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'ది ఘోస్ట్'. పేరుకు తగ్గట్లుగానే డైరెక్టర్ ప్రవీన్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ కు చెందిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలిసి పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించిన నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది.
ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్లలో లైగర్ ఇంటర్వెల్ లో ప్లే చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రక్తం కారుతున్న రాడ్డును నాగార్జున పట్టుకున్న సీన్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నేలపై పడిపోయి రివాల్వర్లు కనిపిస్తాయి. దీంతో, ఈ సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. 'అతన్ని నీవు చంపలేవు.. అతన్నుంచి తప్పించుకుని పారిపోలేవు.. అతనితో బేరాలు కూడా ఆడలేవు.. కేవలం క్షమించమని మాత్రమే అడుక్కోగలవు' అంటూ ట్రైలర్ కొనసాగుతుంది. ఈ సినిమాను అప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 5వ తేదీన 'ది ఘోస్ట్' విడుదల కానుంది.
Next Story