Sun Dec 22 2024 21:46:02 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడిని పెళ్లాడిన "నాగిని" నటి మౌనీ రాయ్
పాపులర్ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడు సూరజ్ నంబియార్ తో గురువారం.. గోవాలో మలయాళీ
పాపులర్ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడు సూరజ్ నంబియార్ తో గురువారం.. గోవాలో మలయాళీ సాంప్రదాయం ప్రకారం మౌనీరాయ్ పెళ్లి తంతు జరిగింది. పెళ్లితో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా.. సాదా సీదాగా పెళ్లితంతును ముగించారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : సమంతే చైతన్యను విడాకులు కోరింది : నాగార్జున
దుబాయ్ లో సెటిల్ అయిన సూరజ్ తో మౌనీరాయ్ కొంతకాలంగా రిలేషన్ లో ఉంది. ఆమె టీవీ, సినీ నటిగా.. సింగర్ గా మంచి గుర్తింపు పొందింది. నాగిని సీరియల్ మౌనీ రాయ్ కు పాపులారిటీని ఇచ్చింది. తెలుగులోనూ ఆ సీరియల్ ప్రసారం కావడంతో.. తెలుగు ప్రేక్షకులకూ మౌనీ రాయ్ సుపరిచితురాలే. అలాగే అభిషేక్ బచ్చన్ 'రన్' సినిమాలో స్పెషల్ సాంగ్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ లో స్పెషల్ సాంగ్ చేసింది.
Next Story