Mon Dec 23 2024 11:35:57 GMT+0000 (Coordinated Universal Time)
నాగశౌర్య-మాళవిక జంటగా.. "ఫలాన్ అమ్మాయి ఫలానా అబ్బాయి"
ఇప్పటికీ టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ‘ఫలానా..
నటుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి దర్శకుడిగా మారనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ సినిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. మరో ఎంటర్టైనర్ తో రెడీ అవుతోంది.
నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలూ.. తమలోని ప్రతిభకు గుర్తింపు తెచ్చాయి. ఇప్పటికీ టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు.
Next Story