Mon Dec 23 2024 12:00:07 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబు తనయుడు గౌతమ్ యాక్టింగ్ స్కూల్కి వెళ్తున్నాడా..?
మహేష్ బాబు వారసుడు గౌతమ్ బర్త్ డే ఈరోజు కావడంతో ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సోషల్ మీడియా వేదికగా తనకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పోస్టుల్లో నమ్రతా శిరోద్కర్ చేసిన పోస్ట్ మహేష్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.
మహేష్ బాబు (Mahesh Babu) వారసుడు గౌతమ్ (Gautam Ghattamaneni) బర్త్ డే ఈరోజు కావడంతో ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సోషల్ మీడియా వేదికగా తనకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పోస్టుల్లో గౌతమ్ తల్లి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) చేసిన పోస్ట్ మహేష్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. గౌతమ్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళబోతున్నాడా..? అనే సందేహాన్ని కలిగిస్తుంది.
ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. "హ్యాపీ బర్త్ డే గౌతమ్. ఇయర్స్ పెరుగుతున్న కొద్ది నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు మరింత గొప్ప స్థాయికి ఎదగాలి, అనుకున్న కలలను నెరవేర్చుకోవాలి. ఇక ఈ బర్త్ డే మాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోతావు. కాబట్టి ఈ పుట్టినరోజుని ఎంతో స్పెషల్ గా చేస్తాను" అంటూ రాసుకొచ్చింది.
ఇక నమ్రతా కామెంట్స్ చూసిన మహేష్ అభిమానులకు ఒక సందేహం కలుగుతుంది. నెక్స్ట్ ఇయర్ గౌతమ్ ఫ్యామిలీతో ఉండకుండా విదేశాలకు చదువు కోసం వెళ్తాడని నమ్రతా మాటల్లో అర్ధమవుతుంది. అయితే గౌతమ్ విదేశాల్లో ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ కోర్స్ నేర్చుకోనున్నాడా..? అని మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో నమ్రతాని గౌతమ్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. తన ఎంట్రీ మరో 10 ఏళ్ళు పడుతుందని చెప్పుకొచ్చింది.
కాగా గౌతమ్ ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అభిమానులను పలకరించాడు. ఆ తరువాత మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం పూర్తిగా చదువు మీదనే దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత యాక్టింగ్ కోర్స్, సినిమాలు అని తెలుస్తుంది. ఇక గౌతమ్ వరుస ఇలా ఉంటే, తన చెల్లెలు సితార (Sitara) యాడ్స్ లో నటించి మోడల్ గా మారిపోయింది. మొదటిలో మహేష్ తో కలిసి యాడ్స్ కనిపించిన సితార.. ఇప్పుడు తానే ఒక సంస్థకి బ్రాండ్ అంబాసడర్ అయ్యిపోయింది.
Next Story