Mon Dec 23 2024 08:16:09 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు శిరీష్ పై నందమూరి బాలకృష్ణ సెటైర్లు వింటే
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా, నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. మొదట నందమూరి అభిమానులకు, అల్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. గీతా ఆర్ట్స్ ను 1974లో స్థాపించారు .. ఆ ఏడాదిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అప్పుడు నాకు 14 ఏళ్లు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సంస్థను నిలబెడుతూ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ముందు నుంచి కూడా అల్లు కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులంతా కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే ఇది.
ఈ సినిమా ట్రైలర్ చూశాను .. శిరీష్ బయటకూడా ఇంతేనా అనిపించింది. ఇక లాభం లేదు .. ఇతన్ని 'అన్ స్టాపబుల్' షోకి పిలిచి అన్ని విషయాలను బయటికి లాగుతాను. సినిమా అయితే చాలా కలర్ ఫుల్ గా ఉందనే విషయం మాత్రం అర్థమవుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ చాలా అందంగా కనిపిస్తోంది. నటన కూడా బాగా చేసిందని తెలుస్తూనే ఉంది. అల్లు అరవింద్ తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మా కాంబినేషన్ లో వచ్చిన టాక్ షో ఎంత గొప్ప హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఊర్వశివో రాక్షసివో సినిమాలో మసాలా బాగా ఉందని చెప్పుకొచ్చారు. గెస్ట్ గా అల్లు శిరీష్ ను పిలిపించి మొత్తం కూపీ లాగుతానని అన్నారు. సినిమా మంచి హిట్ అవ్వాలని అనుకుంటున్నానని తెలిపారు. నా విషయానికి వస్తే నా అభిమానూలు కోరుకునే పాత్రలను చేస్తూ వెళతాను. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ సినిమా చేయనని అన్నారు. వాళ్లపై బలవంతంగా నా ఇష్టాలను రుద్దాలనుకోనన్నారు.
Next Story