Sun Apr 27 2025 01:00:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్.. బాలయ్యకు కరోనా
గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ.. వెంటనే కరోనా పరీక్షలు

సినీ నటుడు, హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారినపడ్డట్లు ఆయనే స్వయంగా తెలిపారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలియజేసారు. గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ.. వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నానన్నారు. తన గురించి ఆందోళన చెందవద్దని తన అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు.
News Summary - mla nandamuri balakrishna got covid-19 positive
Next Story