Sun Apr 20 2025 21:05:31 GMT+0000 (Coordinated Universal Time)
Nandamuri Balakrishana: ఎన్.బి.కే ఫ్యాన్స్.. మీకు మరో తీపికబురు.. ఇంకో మూవీకి బాలయ్య ఓకే
నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా నిత్యం బిజీగానే ఉంటాడు.

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా నిత్యం బిజీగానే ఉంటాడు. సినిమాల మీదసినిమాలు చేస్తుంటాడు. బహుశా ఆ తరం హీరోలకు ఎవరికీఇది సాధ్యం కాదన్నది వాస్తవం. గ్యాప్ లేకుండా మూవీలు చేయడం బాలకృష్ణ కు అలవాటు. అలాగే ఆయనతో మూవీ తీయడానికి నిర్మాతల నుంచి దర్శకుల వరకూ క్యూ కడుతుంటారు. దానికి కారణం మినిమం హిట్ ఇస్తాడన్న గ్యారంటీతో పాటు నిర్మాతలకు నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని అందరూ నమ్ముతారు. అందుకే బాలకృష్ణ నిత్యం బిజీగానే ఉంటారు.
రాజకీయాల్లో ఉన్నా...
రాజకీయాల్లో ఉన్నా.. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయనకు కెమెరా తర్వాతనే ఏదైనా. ఆయన షూటింగ్ అంటే మహా పిచ్చి. ఒక్కక్షణం కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి బాలయ్య ఇష్టపడరంటారు. బాలయ్యకు వచ్చే ఆఫర్లు కూడా అలాగే ఉంటాయి. ఈ ఏడాది మొదట్లోనే బాలయ్య డాకూ మహరాజ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. బాక్సాఫీసును బద్దలు కొట్టేశాడు. నేటి యువహీరోలకు పోటీగా సినిమాలు విడుదల చేస్తూ బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతున్నాడు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
ఇక ప్రస్తుతం అఖండ 2 సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రం కూడా బాలయ్య బాబు కెరీర్ లో మరో హిట్ తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. హిమాలయాల్లో అఘోరాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. అఖండ 2 మూవీ దసరాకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీ పూర్తి అయిన వెంటనే మరొక సినిమాకు కూడా బాలయ్య అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. గోపిచంద్ మలినేని కథ విన్న బాలయ్య అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీర సింహారెడ్డి రిలీజ్ అయి మంచి హిట్ అందుకోవడంతో మరోసారి గోపిచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి బాలకృష్ణ సైన్ చేశారన్నది టాలీవుడ్ టాక్. మరి నందమూరి ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కదా?
Next Story