Mon Dec 23 2024 07:43:41 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి మంచి మనసు చాటుకున్న నందమూరి బాలకృష్ణ.. ఆ డబ్బంతా అందుకే
నందమూరి బాలకృష్ణ.. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకువెళ్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా నందమూరి బాలకృష్ణ ముందున్న సంగతి తెలిసిందే..! ఇక ఇప్పటికే అన్ స్టాపబుల్ షో చేస్తూ ఆ డబ్బునంతా సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ ఉన్నారు బాలయ్య. ఇప్పుడు తన కెరీర్ లో తొలిసారి ఒక యాడ్ లో నటించిన బాలకృష్ణ ఆ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకే ఉపయోగించనున్నారు.
బాలకృష్ణ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.. దీనికి సంబంధించి ఓ కమర్షియల్ షూటింగ్ను స్టార్ట్ చేశారు. బాలయ్య ఇప్పుడు ఈ యాడ్ రెమ్యునరేషన్ను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్కి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఇక బాలయ్య తదుపరి సినిమా 'వీర సింహ రెడ్డి'ని 2023 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత, బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు.
Next Story