Sun Dec 22 2024 22:49:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఒంగోలుకు వీరసింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలులో జరగనుంది
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలులో జరగనుంది. ఈవెంట్ కు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్జున్ ఇన్ ఫ్రా ప్రాంగణంలో పెద్ద వేదికను నిర్మించారు. దూరంగా ఉండేవారు వీక్షించే విధంగా ఎల్సీడీ స్క్రీన్ లను పెద్దయెత్తున ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుక ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఒంగోలు వాసి కావడంతో...
చిత్ర దర్శకుడు మలినేని గోపిచందర్ ఒంగోలు వాసి కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ , దర్శకుడు మలినేని గోపిచంద్ తదితరులు హాజరుకానున్నారు. బాలయ్య బాబును చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలివస్తారని భావించి నిర్వాహకులు అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story